ఆమె
*ఆమె* *రచన: పానుగంటి రామమూర్తి* జనగామ 9490109599 ********** సగం కాదు ఆమె అనంతం ప్రాణానికే ప్రాణం పోసిన ఆదిశక్తి! మన నడతకు నడకలు నేర్పిన ధీశక్తి మన చదువుల సర్వస్వం ఆమే! భూగోళం చుట్టి గ్రహాతరాలు గెలిచి ఉదయాన్ని నిద్రలేపినా ఆమెకు సాటి ఎవరూలేరు! మానవతను కలగంటూ మనిషిని నిర్మిస్తుంది తరాన్ని సృష్టిస్తుంది! అంతరాల అలలు ఆమెకు తెలియవు ఆత్మీయత అనుబంధం ఆమె రెండు కళ్ళు! మనకో ప్రపంచాన్ని ఇచ్చేసి సాదాసీదాగా మనముందే తిరుగుతుంది భూగోళంలా! దేవతలకోసం వెతికే అమాయకులం మనం అమ్మతనానికి మొక్కులు చెల్లించలేనివాళ్లం ఓ నిశ్శబ్ద కాంతితరంగం ఆ అద్వితీయ అంతరంగం మన వారసత్వ సంపద *ఆమె* ను కాపాడుకుందాం! అమ్మకు మొక్కుకుందాం! ************* (రేపు 8 మార్చి 2025 మహిళాదినోత్సవం సందర్భంగా...)