గుజ్జుల నర్సయ్య సార్ అస్తమయం 24/9/2022
అస్తమించిన జ్ఞానభాస్కరుడు
గుజ్జుల నర్సయ్య🙏🙏🙏🙏🙏
పరిచయం అక్కరలేని ధన్యజీవి.
ఆ మహోన్నత వ్యక్తి మా ఊరి(ఖిలాషాహపురం) నుండి జాతీయస్థాయికి ఎదిగిన ఉత్తమ అధ్యాపకులు వక్త నాయకుడు హిందూ ధర్మం మర్మం విప్పి మానవీయ ధర్మంగా ప్రబోధించిన జ్ఞాని.. తపస్వి .. నిరాడంబరుడు. వారితో గత నాలుగు దశాబ్దాలుగా సాన్నిహిత్యం కలిగి ఉండడం నా అదృష్టం. మా యువసాహితీ కళాసమితి ఖిలాషాహపురం గౌరవ అధ్యక్షులుగా వారు, అధ్యక్షునిగా నేను మా మిత్రబృందం కలిసి నిర్వహించిన సాహిత్య సుగంధాలు ఎప్పటికీ వాయువీధిలో విహరిస్తూనే ఉంటాయి. ఆ మంచితనం నిరంతర మందహాసం కోటికొక్కరిలో కూడా కన్పించదు. భౌతికంగా లేకపోయినా ఆయన పంచిన జ్ఞానకిరణాలు ప్రతి ప్రభాతంలోనూ వెలుగులు నింపుతూనే ఉంటాయి. అశ్రునయనాలతో మా నర్సన్నకు శ్రద్ధాంజలి 🙏
Comments
Post a Comment