భయం
చీకటి దుప్పటి
కప్పుకున్న రాత్రి
నిశ్శబ్దాన్ని శ్వాసిస్తున్న
నగరం నాగరికత
మూల్గుతూ ప్రవహిస్తూ
మురుగుకొంగు మాటున మూసీనది
ఒక ముసలికుక్క రోదన
గుడ్లగూబ అరుపు
హాస్పిటల్ వైపు పరుగెత్తెే అంబులెన్స్
అప్పుడే బయల్దేరిన గస్తీపోలీసు వాహనం
భయం భయం భయం
అలికిడి లేకుంటే
అంతటా ఆవహించేది భయమే!
Comments
Post a Comment