విద్య కకావికలం
చదువుల ఒడి
బడి ఆగం ఆగం
రేపటి పౌరుల దశ
దిశ వెతుక్కుంటోంది
కరోనావిలయంతో
విలవిలలాడుతోంది బాల్యం
అదృశ్య పాఠాల
అయోమయ తతంగం
పేదబాలలను వెక్కిరిస్తుంటే
విధి నిర్వహణలో
వెలవెలబోతున్న పంతులు
చదువుల చెట్టు మళ్లీ
చిగురించేదెప్పుడో!
పిల్లలు పిట్టలై
ఆ తరుశాఖల్లో
తిరుగాడేదెప్పుడో!
Comments
Post a Comment