ఎక్కడ మొదలై

ఏ మూలన ఆగేనో

చలనం జ్వలనంలా!

మదిగుడిలో  ఒదిగిన

మూలవిరాట్టు నేత్రంలా!

మథనం అంచున

లభించే అమృతం వెనుక

జరిగిన శ్రమసంగతులెన్ని!

ఇంకెన్నాళ్ళీ రహస్య యుద్ధం

మానవకత మరుగైతే

మనిషికి స్థానం ఎక్కడ!

కరుణ వాత్సల్యం 

కురిస్తేనే జనకళ్యాణం!


Comments

Popular posts from this blog

పేదల బతుకులు

గుజ్జుల నర్సయ్య సార్ అస్తమయం 24/9/2022