*అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్ళీ వినాలి* (స్మృతిగీతం)

అమ్మంటే ప్రాణం  

నరాల్లో వహించే జీవం 

ఊహల మేఘాలను చూపిస్తూ

బతుకు బువ్వను తినిపించిన అమృత హస్తం

కాలపు ప్రవాహంలో కనిపించని అభయ హస్తం  

అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి

*    *   *   *

నీ రూపం నా గుండె గుడిలో  

మూలవిరాట్టు  

నీ జ్ఞాపకం నా హృదయ లయలో జీవనాదం

నీ దీవెన నా జీవనయానంలో గమించే చేతనచక్రం 

అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్ళీ వినాలి 

*   *    *    *

కష్టాల కడలి ముంచెత్తిన ప్పుడల్లా  

నీవిచ్చి వెళ్లిన ఆత్మస్థైర్యం తీరమై

అక్కున చేర్చుకుంటుంది

విషాదం విషమై బుసకొట్టినప్పుడల్లా

నీవందించిన ఆనందం అమృతమై వర్షిస్తుంది

దైన్యం చీకటిలా నన్నలుముకున్న ప్పుడల్లా  ధైర్యమై నీ రూపం వెన్నుతడుతుంది  

అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి 

*   *   *   *

నా పంచేంద్రియల జ్ఞానం నీవే

వాక్కుకు ఆధారం నీవే  

నవనాడుల్లో చైతన్యస్రవంతి వి నీవే 

పలికే ప్రతి భావానికి అక్షరమైన ఆధారం నీవే

నా మునివేళ్ళు అక్షరాలు దిద్దుతున్నప్పుడు  

మురిసిపోతూ మెరిసిపోయిన నీ కంటివెలుగులో

నేను మనుగడ సాగిస్తున్నా

నాన్న అనంతమయితే నువ్వొక అద్భుతానివి

అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.

***************

Comments

  1. బాగుంది సర్. మీ కవిత్వం బాగా నచ్చుతుంది. అమ్మ స్మరణ లో లీనమై అద్భుత కవితను రాశారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పేదల బతుకులు

గుజ్జుల నర్సయ్య సార్ అస్తమయం 24/9/2022