ఎక్కడ మొదలై ఏ మూలన ఆగేనో చలనం జ్వలనంలా! మదిగుడిలో ఒదిగిన మూలవిరాట్టు నేత్రంలా! మథనం అంచున లభించే అమృతం వెనుక జరిగిన శ్రమసంగతులెన్ని! ఇంకెన్నాళ్ళీ రహస్య యుద్ధం మానవకత మరుగైతే మనిషికి స్థానం ఎక్కడ! కరుణ వాత్సల్యం కురిస్తేనే జనకళ్యాణం!
అస్తమించిన జ్ఞానభాస్కరుడు గుజ్జుల నర్సయ్య🙏🙏🙏🙏🙏 పరిచయం అక్కరలేని ధన్యజీవి. ఆ మహోన్నత వ్యక్తి మా ఊరి(ఖిలాషాహపురం) నుండి జాతీయస్థాయికి ఎదిగిన ఉత్తమ అధ్యాపకులు వక్త నాయకుడు హిందూ ధర్మం మర్మం విప్పి మానవీయ ధర్మంగా ప్రబోధించిన జ్ఞాని.. తపస్వి .. నిరాడంబరుడు. వారితో గత నాలుగు దశాబ్దాలుగా సాన్నిహిత్యం కలిగి ఉండడం నా అదృష్టం. మా యువసాహితీ కళాసమితి ఖిలాషాహపురం గౌరవ అధ్యక్షులుగా వారు, అధ్యక్షునిగా నేను మా మిత్రబృందం కలిసి నిర్వహించిన సాహిత్య సుగంధాలు ఎప్పటికీ వాయువీధిలో విహరిస్తూనే ఉంటాయి. ఆ మంచితనం నిరంతర మందహాసం కోటికొక్కరిలో కూడా కన్పించదు. భౌతికంగా లేకపోయినా ఆయన పంచిన జ్ఞానకిరణాలు ప్రతి ప్రభాతంలోనూ వెలుగులు నింపుతూనే ఉంటాయి. అశ్రునయనాలతో మా నర్సన్నకు శ్రద్ధాంజలి 🙏
కొత్తగా ఉందన్న..,,,
ReplyDeleteచాలా బాగుంది సార్ నా మనసు లోని భావాలకు మీరు అక్షర రూపం ఇచ్చారు అభినందనలు సార్ 👌🙏🙏
ReplyDelete